![]() |
![]() |

సాగర్.. ఈ పేరు ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ మొగలిరేకులు సీరియల్ లో మున్నా భాయ్ అంటే ఠక్కున గుర్తుపడతారు. అప్పట్లో ఈ సీరియల్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. సీరియల్స్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని ఈ సీరియల్ విషయంలో నిజం అయిందని చెప్పొచ్చు. సీరియల్ వచ్చి పదేళ్లు దాటినా.. ఈ సీరియల్ గురించి మాట్లాడుతునే ఉంటారు. ఈ సీరియల్ డైరెక్టర్ మంజుల నాయుడు ఇందులోని పాత్రలని అంతలా మలిచారు.
మున్నా అలియాస్ ఆర్కేనాయుడు.. ఇవి మొగలిరేకులు సీరియల్ లో పాత్రల పేర్లే అయినా అవి ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలుగా నటించాడు సాగర్. తన కెరీర్ ని చిన్న చితక పాత్రలతో మొదలు పెట్టాడు. మొదటగా సాగర్ 'చక్రవాకం' సీరియల్ లో నటించాడు. ఆ తర్వాత 'మొగలిరేకులు' సీరియల్ లో మెయిన్ లీడ్ గా చేసాడు. అదే అతని కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మొగలిరేకులు సీరియల్ కి గాను బెస్ట్ యాక్టర్ గా సాగర్ నంది అవార్డు కూడా అందుకున్నాడు. సాగర్ కి ఈ సీరియల్ ద్వారా మంచి ఫేమ్ వచ్చింది. తనకంటు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత సాగర్ 'మ్యాన్ అఫ్ ది మ్యాచ్ మూవీ', 'సిద్దార్థ' మూవీలలో యాక్ట్ చేసాడు. వాటితో పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఆ తర్వాత 'షాదీ ముబారక్' మూవీలో హీరోగా తన నటనతో అందరిని మెప్పించాడు. ఆ తర్వాత సాగర్ కి అవకాశలు తగ్గడంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటి షో బిగ్ బాస్ సీజన్-7 లోకి సాగర్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
ఈ సీజన్ లో సాగర్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు, మళ్ళీ తన కెరీర్ ని రీస్టార్ట్ చెయ్యనున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ టీం సాగర్ ని అప్రోచ్ అవడం, అగ్రిమెంట్ కూడా పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాగర్ హౌస్ లోకి వెళ్లడం నిజమే అయితే హౌస్ లో మళ్ళీ మున్నా బాయ్ ని చూడొచ్చని ప్రేక్షకులకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత బిగ్ బాస్ ద్వారా టీవీ లో కనిపిస్తున్న సాగర్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి మరి. కాగా ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |